![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-7 ఇప్పటికే ఉల్టా పల్టా థీమ్ తో అదరగొడుతుంది. కంటెస్టెంట్స్ కి కొత్త కొత్త టాస్క్ లతో బిగ్ బాస్ పరీక్షలు పెడుతున్నాడు. అయితే మంగళవారం నుండి కెప్టెన్సీ కోసం టాస్క్ లని ప్రారంభించాడు బిగ్ బాస్.
ఇక మొదటి రోజు " గెలిపించేది మీ నవ్వే".. అనే టాస్క్ ఇవ్వగా అందులో పల్లవి ప్రశాంత్- శివాజీ మొదట బెల్ కొట్టారు. అయితే అమర్ దీప్- ఆట సందీప్, గౌతమ్- శుభశ్రీల ఆర్గుమెంట్ తో సంఛాలక్ గా వ్యవహరించిన యావర్, శోభా శెట్టి ఏకీభవించి మొదటి స్థానం గౌతమ్-శుభశ్రీలకి ఇవ్వగా, రెండవ స్థానం అమర్ దీప్- ఆట సందీప్, మూడవ స్థానం పల్లవి ప్రశాంత్- శివాజీలకి ఇచ్చారు. రెండవ రోజు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్.. "దొరికితే దొంగ, దొరక్కపోతే దొర". ఇందులో బిగ్ బాస్ చెప్పినప్పుడు బడ్డీస్ లోని ఒక్కొక్క టీమ్ నుండి ఒకరు సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళాలని, అక్కడికి వెళ్ళి బిగ్ బాస్ వస్తువులని తీసుకురమ్మన్నాడు.
ఆయితే సీరియల్ బ్యాచ్ అమర్ దీప్- ఆట సందీప్, ప్రియాంక జైన్- శోభా శెట్టి అంతా గ్రూప్ గా ఆడారు. బిగ్ బాస్ చెప్పిన వస్తువులనే కాకుండా చెప్పనివి కూడా తీసుకొచ్చేసారు సీరియల్ బ్యాచ్. అయితే శివాజీ మాత్రం నీతిగా నిజాయితీగా ఆడాలని, అలా అన్నీ తీసుకురావద్దని వారితో చెప్తున్నా, ఎవరూ వినట్లేదు. దీంతో టాస్క్ పూర్తయ్యాక అందరిని ఒక లైన్ లో నిల్చోమన్నాడు బిగ్ బాస్. ఇక టేస్టీ తేజ దొంగిలించిన ఫోన్ ని బ్యాగ్ లో వేసుకుంటడగా..పక్కనే ఉన్న శోభా దాన్ని లాక్కుంది.
అది తన స్ట్రాటజీ అని అంది. ఇక టేస్టీ తేజ-యావర్ ఒక జోడీ కాబట్టి ఫోన్ కోసం యావర్ శోభాని టచ్ చేశాడు. పర్సనల్ ప్లేస్ లో చేయి పెట్టావని శోభా అనగానే యావర్ చేయి తీసాడు. ఇక ఆ తర్వాత నేను చెప్పిన వస్తువులని ఎడమ వైపు, చెప్పకుండా మీరు దొంగతనం చేసినవి కుడివైపు పెట్టమన్నాడు బిగ్ బాస్. ఆ తర్వాత నేను చెప్పకుండా తీసుకొచ్చిన వస్తువుల్లో తక్కువ ఎవరి దగ్గర ఉన్నాయో వారే విజేత అని తెలిపాడు. సీరియల్ బ్యాచ్ అంతా ఏడు, ఎనిమిది అదనంగా తీసుకొస్తే.. పల్లవి ప్రశాంత్ ఒకే ఒక వస్తువు అదనంగా తెచ్చాడు. శివాజీ మాత్రం బిగ్ బాస్ చెప్పిన వస్తువు ఒక్కటి మాత్రమే తెచ్చి, టాస్క్ రూల్స్ ని ఫాలో చేసి బిగ్ బాస్ చూసే ప్రేక్షకుల మనసు గెలిచాడు. ఇక సీరియల్ బ్యాచ్ అత్యాశ, దురాశ అన్నీ కలిసి వారిని ఓటమి అంచున నిల్చోబెట్టాయి.
![]() |
![]() |